తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉంది

సోనియాతో భేటి అనంతరం పాల్వాయి

ఢిల్లీ: తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఒక పరిష్కారం లభిస్తుందని ఉప ఎన్నికల్లో ఓటమికి జగన్‌ అరెస్టే కారణమని సోనియా వాఖ్యనించినట్లు ఆయన తెలిపారు.