తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి:చుక్కా రామయ్య

 

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 1నాటికల్లా గతంలో తెలంగాణ ప్రజలకిచ్చిన హీమీలను నెరవేర్చాలని తెలంగాణ సమన్వయ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవటంవల్లనే నవంబర్‌ 1న మోసపూరిత దినంగా పాటించాల్సి వస్తోందని చుక్కా రామయ్య అన్నారు.