తెలంగాణ బాబు పాదయాత్ర నేటి నుంచి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్లున్నా. మీకోసం’ పాదయాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభం కానుంది, సోమవారం నుంచి ఆయన తెలంగాణ లోకి అడుగుపెట్ట నున్నారు. కర్నూలు నుంచి సుంకేశుల జలాశయం మీదుగా సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రాజోలికి చేరుకొని బాబు తన పర్యటనకు తెలంగాణ లో శ్రీకారం చుట్టనున్నారు. తలెంగాణ జిల్లాలో తొలి కార్యక్రమం కావడంతో భారీ జన సందోహం మధ్య కొన సాగించాలని తెదేపా వర్గాలు పట్టుదలతో ఉన్నాయి. మరో వైపు బాబు తెలంగాణ వైఖరి పై స్పష్టమైన వైఖరి చెప్పిన తరువాత తెలంగాణ లో అడుగుపెట్టాలని రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస నేతలు డియాండ్‌ చేస్తున్నారు. ఐకాస కన్వినరు కోదండరాం జిల్లాకు వచ్చి బాబు పర్యటనను అడ్డు కోవాలంటూ తెలంగాణవాదులను కోరారు. చంద్ర బాబు జిల్లా లోకి ప్రవేశించ కుండా అడ్డు కుంటామన్నారు.