తెలంగాణ భవన్‌పై దాడి అమానుషం

విచారణ జరిపించండి : ఈటెల డిమాండ్‌
హైద్రాబాద్‌,జూలై 23 (జనంసాక్షి): వైయస్‌ విజయమ్మ సిరిసిల్ల దీక్ష సందర్భంగా తెలంగాణ భవన్‌పై దాడి చేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. శాంతియుతంగా తెలం గాణ భవన్‌ లోపల ఆందోళన చేస్తున్న విద్యార్థులను లోపలికి ప్రవే శించి విచక్షణారహితంగా కొట్టారనీ దీన్ని తీవ్రంగా ఖండ ిస్తున్నామన్నారు. సిరి సిల్ల దీక్షను సాకుగా చూపి అకారణంగా పోలీసులు తెలంగాణభవన్‌లోకి చొచ్చుకొచ్చి మరీ విద్యార్థులపై దాడి చేశారనీ ఆరోపించారు. సిరిసిల్లలో కూడా అకారణంగా విరుచుకుపడి తెలంగాణవాదులను తీవ్రంగా గాయపరిచాడన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదే అంశంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం చాంబర్‌ ఎదుట నిరసన తెలిపారు. విచారణ జరిపించి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటెల రాజేందర్‌ సీఎంను కోరారు.