తెలంగాణ భవన్‌లో అవతరణ వేడుకలు

BHAVAN-LIVE-01-NAINIసీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ది చెందుతుందని హోం మంత్రి నాయిని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో నాయిని పాల్గొన్నారు, జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.