తెలంగాణ భాష యాస ను సినిమాల్లో ఎగతాళి చేసే ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు

బీజేపీకి హరీష్‌ సూటి ప్రశ్న

తెలంగాణ భాష, యాసను సినిమాల్లో  ఎగతాళి చేసే    ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు

బీజేపీకి హరీష్‌ సూటి ప్రశ్న
పరకాల,జూన్‌ 10 (జనంసాక్షి):  సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను ఎగతాళి చేసిన హాస్యనటుడు కోట శ్రీనివాసరావుతో పరకాల ఉప ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు బీజేపీని సూటిగా ప్రశ్నించారు.   సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను ఎగతాళి చేస్తూ తెలంగాణవాదులను తన హావభావాలతో కించపర్చిన కించపర్చిన కోట శ్రీనివాసరావుతో ప్రచారం చేయించడం ద్వారా బీజేపీ తెలంగాణవాదులను  మనసులను మరింత గాయపర్చిందన్నారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న తెలంగాణవాదులను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కోట శ్రీనివాస్‌రావుతో బీజేపీ ప్రచారం చేయించడం ఆక్షేపణీయమన్నారు. ఈ విషయంలో బీజేపీ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పరకాల ఓటర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.