తెలంగాణ మార్చ్‌కు అడ్డంకులు సృష్టించొద్దు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సర్కార్‌ అడ్డంకులు సృష్టించొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బైండోవర్‌ కేసులు పెడితే బీజేపీ నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులకు సంతకాలు చేయవద్దని, అవసరమైనతే జైలుకెళ్లండి అని సూచించారు. హైదరాబాద్‌కు రాలేని వారు జిల్లాల్లోనే శాంతియుత ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.