తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందే:చెన్నమనేని రమేష్‌

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందేనని టీఆర్‌ఎస్‌ నేత, మేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదుల అరెస్టును వెంటనే నిలిపివేయాలని, లేకుంటే తీవ్రపరిణామాలేంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ వాదులు ప్రజాస్వామ్య బద్ధంగా మార్చ్‌ చేసుకుంటే సీమాంధ్ర ప్రభుత్వానికి అభ్యంతరమేమిటని ప్రశ్నించారు.