తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటాం: హరీషరావు

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యుద్ధభేరీ మోగిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హారీష్‌రావు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌  పార్టీ మార్చ్‌లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మాణం చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన తెలియజేశారు.