తెలంగాణ మార్చ్‌ ఖచ్చితంగా జరుగుతుంది: కోదండరాం

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’ను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరపాలని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రజలు సహకరించాలని ఆయన విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావివ్వకూడదని ఆయన కోరారు. మార్చ్‌లోని హింస జరిగేలా సీమాంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని. అందుకు తెలంగాణ ప్రజలుఉ అప్రమత్తంగా ఉంది మార్చ్‌ను విజయవంతంగా పూర్తి  చేసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీమాంధ్ర నేతలు విషప్రచారానికి పూనుకున్నారని ఆయన ఆరోపించారు.