తెలంగాణ మార్చ్‌ గురించి ఎంపీ వివేక్‌ నివాసంలో కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. తెరాస తెలంగాణ మార్చ్‌ గురించి తాము అందులో పోసించవలసిన పాత్ర గురించి చర్చించేందుకు సమావేశమైనట్లు తెలుస్తూంది. ఈ సమావేశానికి మంత్రులు జానారెడ్డి, సారయ్య, ఎంపీలు మధుయాష్కీ గుత్తా సుఖెందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కేకేలు హాజరాయ్యారు.