తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యపై దాడిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల కేసీఆర్‌, కేటీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వరంగల్‌ జిల్లాలోని పోచమ్మ మైదాన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పొన్నాలపై దాడిని నిరసిస్తూ నల్గొండలో కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు భారీ ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా కొందరు కార్యకర్తలు ధర్నా చేశారు.