తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల కళ్లు తెరిపంచేలా మార్చ్‌ నిర్వహించాలి: జానారెడ్డి

హైదరాబాద్‌: ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌లో ఆత్మగౌరవ ఆకాంక్షను చాటాలి అని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను మార్చ్‌ రోజున అధిష్టానానికి తెలియజేయాలని తెలిపారు. ఆ రోజు తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల కళ్లు తెరిపించేలా శాంతియుతంగా మార్చ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి విధ్వసాలకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం వ్వతిరేకం కాదని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ వచ్చే వారికి ఎలాంటి ఆటంకాలు, బైండోవర్‌ కేసులు ఉండవని స్పష్టం చేశారు. మార్చ్‌కు ప్రభుత్వం సహకరించాలని కోరారు.