తెలుగు విజయ యాత్ర సైకిల్ ర్యాలీ ప్రారంభం
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలంతా హాజరై మాతృభాష వైభవాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారుజ ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ నెట్ వర్క సంఘ:, అట్లాంటా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంజీవయ్య పార్కు వద్ద నుంచి తెలుగు విజయ యాత్ర సైకిల్ ర్యాలీని బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు. ఈయాత్ర మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం మదనపల్లె, చిత్తూరు మీదుగా తిరుపతికి చేరుకుంటుందని చెప్పారు. తెలుగు భాష గోప్పతనాన్ని చాటిచెప్పేలా మహా సభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.