తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది: చంద్రబాబు

హైదరాబాద్‌: తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రైతులకు వ్వవసాయ ఖర్చులు పెరిగి గిట్టుబాటు ధర దక్కట్లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన తెదేపాతోనే సాధ్యమని చంద్రబాబు చెప్పారు.