త్వరలో మరిన్ని మెడిరల్‌ కళాశాలలు

మట్టెవాడ: వరంగల్‌ ప్రాంతంలోని లాల్‌బహదూర్‌ కళాశాలలో బుధవారం ఉదయం కళాశాల నూతన మహిళా వసతి గృహం ఇండోర్‌ స్టేడియం ప్రారంభోత్సరం, శంకుస్థాపన జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు జానారెడ్డి, సారయ్య, ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్‌ ఎంపీ సిరిసిల్ల, రాజయ్య ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ త్వరలో జిల్లాలో మెడికల్‌ కళాశాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. టీజీవీటీ ( తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ) ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ నినాదాలు చేస్తూ జానారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి మట్టేవాడ పోలీస్‌ స్టేషన్‌ తరలించారు.