త్వరలో వడ్డీరేట్లు తగ్గొచ్చు!

జ‌నంసాక్షి:  వచ్చే సమీక్షల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్లను 0.75 శాతం మేర తగ్గించవచ్చని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసింది. ఏప్రిల్ 3న జరుగబోయే సమీక్షలో రెపోరేటును 0.50 శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయని సంస్థ భావిస్తున్నది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, వర్ధమాన దేశాలపై ఆ నిర్ణయ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నాక మరో పావు శాతం తగ్గించవచ్చని అంటున్నది. అలాగే వచ్చే జనవరి కల్లా రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 5.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో సంస్థ వెల్లడించింది. గతంలో 5.8 శాతంగా అంచనావేసింది. ఈమధ్యే రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాల మదింపులో ప్రామాణికంగా తీసుకునే సంవత్సరాన్ని 2012కు మార్చారు. ఈనేపథ్యంలో స్టాన్ చార్ట్ కూడా అంచనాలను సవరించింది.