దంపతులకు నిప్పంటించిన దుండగులు

తాడిపత్రి: అనంతపురం జిల్లా పెద్దప్పూరులో ఆరుబయట నిద్రిస్తున్న సంజీవరెడ్డి, రామాంజనమ్మ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్‌పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో భర్తకు స్వల్ప గాయాల్వగా భార్య తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామాంజనమ్మ పరిస్థితి విషమంగా ఉంది.