దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

హైదరాబాద్‌: 2012-13 ఏడాది ఆర్థిక సంవత్సరానికి తొలి 6నెలలకు ప్రయాణికులు, సరకు రవాణాతో కలిసి రికార్డు స్థాయిలో ఆదాయం 4వేల 679కోట్ల వసూళ్లను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే రూ.945కోట్ల అదనపు రాబడి వచ్చింది. మొత్తం 25శాతం వృద్దిరేటును నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 53.1మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేసింది. ప్రయాణికుల విభాగంలో 194మిలియన్‌ మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు వెల్లడించారు.