దఫా బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్ : ఈ నెల 26 వరకు మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపటి నుంచి చర్చ ప్రారంభమవుతుంది. 18న బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 26న ఓటాన్ అకౌంట్‌పై చర్చ జరుగుతుంది. రెండు విడతలు కలిపి మొత్తం 55 రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.