దళితబంధులపై లెక్కలేసుకుంటున్న దళితులు

share on facebook

గ్రామాల వారీగా దళితుల సంఖ్యపై మొదలైన చర్చ
మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపు
కరీంనగర్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం దళితుల సాధికారిత పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ’దళితబంధు’పైనే ప్రస్తుతం అందరి దృషి కేంద్రీకృతమవ్వడమే గాకుండా చర్చిస్తున్నారు. దళిత సంఘాలు, నేతలు దీనిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు దళితుల రక్షణ కోసం ప్రత్యేకం నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతోదళితులు ఆశలు పెంచుకుంటున్నారు. హుజూరాబాద్‌ తరహాలోనే లబ్దిదారుల ఎంపిక చేపట్టే అవకాశాలు ఉండడడంతో ఆశావాహులు దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందడం కోసం ఇప్పటి నుంచే కార్యాల యాలకు వస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి రెండు శాసనస భ నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి వంద మంది చొప్పున 200 మంది లబ్దిదారులను మొదటి విడతలో ఎంపిక చేసే పరిస్థితి ఉందంటున్నారు. ఈ పథకం అమల్లో స్థానిక ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారడంతో వారిని ప్రసన్నం చేసుకు నేందుకు లబ్దిదారులు ప్రయ త్నాలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ఆధారంగా దళితులను వారి ఆర్థిక స్థాయి ఆధారంగా ఎంపిక చేసి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా పథకాన్ని అమలు చేయనున్నట్టు అధికార వర్గాల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించడంతో దళితుల్లో దీనిపై సరికొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా అమలు చేస్తున్నారు. ఇదే తరహాలో మిగితా జిల్లాల్లోనూ ఎస్సీ కార్పొరేషన్‌కే ఈ పథకం అమలును అప్పగించను న్నారని తెలుస్తోంది. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ నేతృ త్వంలో లబ్దిదారుల ఎంపిక చేపట్టడం ద్వారా రాజకీయాల జోక్యం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో లబ్దిదారులకు సంబంధించి వారం, పది రోజుల్లో పూర్తి విధి విధానాలు ఖరారు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఎలాంటి విధి విధానాలను జారీ చేయలేదు. కాగా జిల్లా వ్యాప్తగా సుమారు 20వేల కుటుంబాల వరకు ఉండొచ్చన్న అంచనా. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు ప్రకటించిన దరిమిలా 20వేల కుటుంబాల్లో అదృష్టం ఎవర్ని వరిస్తోందన్న అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. నియోజకవర్గానికి 100 కుటుంబాలను మాత్రమే మొదటి విడతలో ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుండడంతో
లబ్దిదారుల ఎంపిక ఎలా ఉంటుందన్నది ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల తరహాలోనే సాగితే ఈ పథకం కూడా అభాసుపాలయ్యే అవకాశాలు లేక పోలేదని దళిత సంఘాల నేతలు చెబుతున్నారు. జిల్లాలో గిరిజనుల తర్వాత పెద్ద సంఖ్యలో ఉన్న దళిత కుటుంబాల్లో 95 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నవారేనని చెప్పవచ్చు. దళితుల ఆర్థిక సాధికారిత పేరిట ప్రారంభించిన దళితబస్తీ పథకం ఆచరణలో అతీగతీ లేని పరిస్థితి నెలకొంది. ఈ పథకం ప్రారంభం నుంచి నేటి వరకు అర్హులైన లబ్దిదారుల ఎంపిక జరుగుతున్నప్పటికీ భూమి కొనుగోలు పథకం మాత్రం నత్తనడకన సాగుతోంది.
ళితబంధు పథకం విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉంది. లబ్దిదారుల ఎంపిక మొదలు కొని పథకం అమలు వరకు ఎలాంటి విధి విధానాలుంటాయన్నది ఆదేశాలు వచ్చిన తర్వాత కాని చెప్పలేం. ప్రస్తుతానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేసిన పథకాల ను అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Other News

Comments are closed.