దళితులపై మారణకాండ వెనుక సత్యనారాయణ హస్తం ఉంది

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై జరిగిన మారణకాండ వెను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హస్తం ఉందని ఎస్సీ, ఎస్టీ అధికారుల వేదిక ఆరోపించింది.  దోషులను శిక్షంచాలని అధికారులు వేదిక చైర్మన్‌ కాకి మాధవరావు డిమాండ్‌ చేశారు. పథకం ప్రకారమే పోలీస్‌ పికెటింగ్‌ ఎత్తివేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. పోలీసులు అధికారులు నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై  ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఎంపీ మందా జగన్నాథంపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాధవరావు చెప్పారు.