దాడులకు తాత్కాలిక విరామం


` గాజాలో సైనిక చర్యకు ప్రతిరోజూ 4 గంటలపాటు బ్రేక్‌
` స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గం
` అమెరికా అధ్యక్షుడు బైడెన్‌
` గాజా ఆక్రమించాలని లేదు :ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యూ
జెరుసలామ్‌(జనంసాక్షి): ఉత్తర గాజాపై జరుగుతున్న భీకర దాడులకు ప్రతి రోజూ 4 గంటల పాటు బ్రేక్‌ ఇవ్వనున్నారు. ఇజ్రాయిల్‌ సైన్యం రోజూ ఓ నాలుగు గంటల పాటు అటాక్‌ చేయదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. అయితే ఆ సమయంలో ఉత్తర గాజాలో ఉన్న ప్రజలు అక్కడ నుంచి తరలివెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గమని ఆయన అన్నారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యూ కూడా స్పందించారు.గాజాను ఆక్రమించాలని లేదని, ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకోవాలన్న ఆశ కూడా లేదని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యూ తెలిపారు. హమాస్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏలాలన్న ఆలోచన కూడా లేదన్నారు. గాజాను ఆక్రమించేందుకు ఇజ్రాయిల్‌ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని అమెరికా కూడా పేర్కొన్నది.జెనిన్‌ సిటీపై గురువారం జరిగిన దాడిలో 15 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇజ్రాయిల్‌ దళాల అటాక్‌లో మరో 20 మంది గాయపడ్డారు. జెనిన్‌ నగరంలో యాంటీ టెర్రరిజం సోదాలు చేస్తున్నట్లు ఇజ్రాయిల్‌ మిలిటరీ ప్రకటించింది. అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై అటాక్‌ జరిగిన తర్వాత ..వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలో 178 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు.