దీక్ష విరమించిన బాబా రాందేవ్‌

న్యూఢిల్లీ: యోగాగుకు బాబా రాందేవ్‌ తన దీక్షను విరమించారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించాలంటూ అయిదురోజులుగా దీక్ష చేస్తున్న ఆయన తన దీక్షను  ఈరోజు మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుని విరమించారు.  స్టేడియాన్ని ఖాళీ చేయనున్నట్లు ప్రకటించారు. అయిదురోజులుగా స్నానపానాదులు, భోజనం లేదని ఇక్కడినుంచి నేరుగా హరిద్వార్‌ వెళ్లి గంగానదిలో పవిత్రస్నానం చేస్తానని ఆయన అన్నారు.