దీపం పథకం లబ్ధిదారులకే 9 సిలిండర్లు

హైదరాబాద్‌: మధ్య తరగతి ఆశలు అడియాసలే అయ్యాయి. దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే రాయితీపై ఏడాదికి 9 సిలిండర్లు పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా ఇచ్చే మూడు సిలిండర్ల రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ. 634 కోట్ల భారం పడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రతి సిలిండర్‌పై ఇస్తున్న రూ. 25 రాయితీ కొనసాగించాలా వద్దా అనేది ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.