దేశసేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి.. కొండాలక్ష్మణ్‌ బాపూజీ

కూకట్ పల్లి (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు.బుధవారం
కొండా లక్ష్మణ్‌ బాపూజీ 10వ వర్థంతి సందర్భంగా డివిజన్ పరిధిలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేత అన్నారు.అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా.. దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్‌ బాపూజీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎన్. ఆంజనేయులు, వెంకటకృష్ణ, పి.శివశంకర్, ఎస్.మోహన్, వి.విష్ణు, సి.ఎచ్. బిక్షమయ్య, బి.శంకరయ్య, ఎ. దయానంద్, ఎం.నవీన్ కుమార్, గోవర్ధన్, మణయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.