దోంగల ముఠా అరెస్టు

ఇచ్చాపురం : శ్రీకాకులం జిల్లా కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌లో పలు చోరీలకు పాల్పడిన ముఠా సభ్యులు 6గురికి ఇచ్చాపురం పోలిసులు అరెస్టు చేశారు. గత అగస్టు నుంచి ఇప్పటివరకు ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, కవిటి,కాశీబుగ్గ ప్రాంతాంతో పాటు ఒరిస్సాలోని చికటిపేటలలో వీరు 14 నేరాలకు పాల్పడ్డారు. ఎక్కువగా దేవాలయాలు, ఇళ్లు దుకాణాలను లూటీ చేస్తూ విలువైన సామగ్రిని దోచుకుపోయారు.పట్టుబడిన నేరగాళ్లందరూ కంచిలి మండలం కేసరపడ గ్రామానికి చెందిన వారు. కాశీబుగ్గ డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ ఇచ్చాపురం పోలీసులను అభీనందించారు. ముఠాలోని మరో నలుగురు అరెస్టు కావలని ఉందని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పెర్కోన్నారు.