ధనార్జన కోసమే నూతన మద్యం విధానాలు: టీడీపీ

వరంగల్‌: ధనార్జన కోసమే ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ రోజు టీడీపీ నేతలు ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ అధికార ప్రతినిధి నేంధర్‌ రెడ్డిలు వరంగల్‌ కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. మద్యం దుకాణాల కేటాయింపులో లాటరీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ధనార్జనే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని వారు లేఖలో ఆరోపించారు. ప్రజలను దోచుకోవడానికే కాంగ్రెస్‌ పాలన కొనాసాగుతోందని విమర్శించారు.