ధర్మవరంలో పట్టుబడ్డ దొంగల ముఠా
అనంతపురం: జిల్లాలోని ధర్మవరంలో వివిధ చోరీ కేసుల్లో నిందితులైన ఆరుగురు దొంగలు ఉన్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.20 లక్షల విలువ చేసే బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గుంటూరు జిల్లావాసులని ధర్మవరం పోలీసులు తెలిపారు.