ధర్మాన నేతృత్వంలోని కమిటీ నేడు మరోమారు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలపై  సమీక్షించేందుకు మంత్రి ధర్మాన  ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్‌ కమీటి ఆదివారం మరో మారు సమావేశం కానుంది. మంత్రి రఘువీరారెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ బలాలు, బలహీనతలు, ప్రభుత్వ పథకాల్లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. నిన్న తొలిసారిగా గాంధీభవన్‌లో ఈ కమిటీ సమావేశమై పార్టీ, ప్రభుత్వ స్థితిగతులపై చర్చించింది.