ధర్మాన ఫైల్‌ను తిప్పి పంపిన గవర్నర్‌

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారం కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ నరసింహన్‌ తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఐదు రోజుల క్రితమే ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ధర్మాన కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని గవర్నర్‌ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయకోవిదులతో చర్చించాలని గవర్నర్‌ సూచించారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి వర్గం ధర్మానకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.