ధర్మాన రాక వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాక వాయిదాపడింది. ఆయన ఈ రోజు హైదరాబాద్‌ వస్తారని అనంతరం సీఎంను కలిసి రాజీనామా చేస్తారని వార్తలు వెలువడిన  నేపథ్యంలో ఆయన రాక వాయిదా పడినట్లు సమాచారం. పలువురు సీనియర్‌ నేతలతో దీనిపై మాట్లాడుతున్న మంత్రి ఆ పని పూర్తికాకపోవటంతో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.