ధర్మాన రాజీనామా యోచనే లేదు: గులాంనబీ

ఢిల్లీ: రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై నిర్ణయం ఇప్పుడే ఉండదని కేంద్రమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన సమాధానం చెప్పుకునేందుకు ఇంకా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పు వూహాగానాలు ఎందుకు వస్తున్నాయో తెలియటం లేదని అన్నారు. అధిష్టానం అలాంటి యోచనేది చేయటం లేదన్నారు.