ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు, జూలై 22 : ప్రస్తుత రబీసీజన్‌లో సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం జిల్లావ్యాప్తంగా ఆదివారం 39 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబ్బందన ప్రకారం 53204 రకం ధాన్యాన్ని క్వింటాల్‌ 1500 రూపాయల వంతున కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ సీజన్‌లో 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తోడుపడుతాయని కలెక్టర్‌ బి. శ్రీధర్‌ అన్నారు.