ధూంధాం దశాబ్ది ఉత్సవాల పోస్టర్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ధూంధాం కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరూత్రలూగిస్తూ పదేళ్లయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీన నగరంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ధూంధాం అధ్యక్షుడు రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ధూంధాంకు సంబంధించిన పోస్టర్‌ను జేఏసీ చైర్మన్ కోదండరాం విడుదల చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు మాట – పాట కార్యక్రమాన్ని, సాయంత్రం ఆరు గంటలకు తెలుగు లలితకళాతోరణంలో ధూంధాం కళా ప్రదర్శినల్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.