నగదు బదిలీ వద్దని రేషన్ డీలర్ల ధర్నా
సోమాజీగూడ : నగదు బదిలీ పథకం అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రేషన్ డీలర్ల జేఏసీ ఎర్రమంజిల్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఆధార్ కార్డుల ఆధారంగా నగదు బదిలీ అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోందని.. అయితే ఇప్పటి వరకూ 30 శాతం కార్డులు కూడా జారీ కాలేదని డీలర్లు అన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో రేషన్ డీలర్లు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.