నగరంలో ఆకట్టుకున్న 1000 మీటర్ల జెండా

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధానిలో అంబరాన్ని అంటాయి. జాతి గర్వించేలా నగర వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సెయింట్‌పాల్‌ పాఠశాల విద్యార్థులతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 1000 మీటర్ల జాతీయ జెండాతో బేగంబజార్‌ నుంచి మొజంజాహి మార్కెట్‌ మీదుగా అబీడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించారు.