నగరంలో చోరీ

హైదరాబాద్‌ : నగరంలోని తార్నాకలోని గోల్డ్‌ వరల్డ్‌ నగల దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు నిన్న రాత్రి దుకాణం తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి 30 తులాల బంగారం, 5 కిలోల వెండి దోచుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.