నగారా మోగింది
ప్రపంచకప్ క్రికెట్ పోటీలు శనివారం తెల్లవారు జామున ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ x శ్రీలంక జట్ల మధ్య ఉదయం 3.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమౌతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమౌతుంది. వరల్డ్‌కప్‌లో దాయాదిజట్లు తలపడేది ఆదివారమే. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. స్టార్ స్పోర్ట్స్, దూరదర్శన్ లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.