నటీమణులకు జయలలిత విందు
చెన్నై: నాటి సహ మేటినటీమణులకు ముఖ్యమంత్రి జయలలిత పోయన్ గార్డెన్‌లోని తన నివాసంలో గురువారం విందు ఇచ్చారు. వీరంతా 1960-80 మధ్య కాలంలో రెండు దశాబ్దాల పైచిలుకు జయలలితతో వెండితెరపై కలసి నటించారు. పాల్గొన్న వారిలో అంజలిదేవి, సరోజదేవి, షావుకారు జానకి, జమున, సుకుమారి, చాచు, రాజశ్రీ, ప్రముఖ హీరో, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్‌తో జయలలిత, సరోజాదేవీలు అనేక చిత్రాల్లో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ప్రముఖ రంగస్థల, సినీనటుడు, ప్రస్తుతం తమిళపత్రిక ‘తుగ్లక్’ సంపాదకులు చో రామస్వామి కూడా విందులో పాల్గొన్నారు.