నర్సరీలను సందర్శించిన ఎంపీడీవో జ్యోతిలక్ష్మి 100 శాతం పెంపకం పూర్తి చేయాలి.
మిర్యాలగూడ,జనం సాక్షి.గ్రామీణ ప్రాంతంలోని నర్సరీలలో మొక్కల పెంపకం 100 శాతం త్వరితగతిన పూర్తి చేయాలని మిర్యాలగూడ ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు, కిష్టాపురం, కొత్తగూడెం గ్రామాలలోని నర్సరీలను ఆమె సందర్శించి, మొక్కల పెంపకం తీరును నర్సరీల అభివృద్ధిని పరిశీలించారు. క్రమము తప్పకుండా మొక్కలకు నీరును అందించాలన్నారు. ఆమె వెంట ఇంచార్జ్ ఏపీవో కళావతి, టిఏఎస్, పంచాయతీ కార్యదర్శులు,తదితరులున్నరు