నర్సరీల పెంపకాన్ని 100% పూర్తి చేయాలి


అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా
మిర్యాలగూడ జనం సాక్షి.
గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల పెంపకం వేగంతో చేసి 100% పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా కోరారు. శుక్రవారం మిర్యాలగూడ మండల పరిధిలోని తక్కెళ్ళపాడు,, యాద్గార్ పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులు నర్సరీల పెంపకాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ తక్కెళ్ళపాడు గ్రామంలో అభివృద్ధి పనులు, నర్సరీ పెంపకం నూటికి నూరు శాతం పూర్తయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. యాద్గర్ పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు, నర్సరీల పెంపకం నిర్వహణ సంతృప్తికరంగా లేదని వాటిని వెంటనే పూర్తి చేయాలని గ్రామ సర్పంచులను కార్యదర్శులను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీఓ వీరారెడ్డి, ఈసీలు, ఇన్చార్జ్ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు విజయ్, రాజశేఖర్ ల తో బాటు ఆయా గ్రామ పంచాయతీల సాంకేతిక సిబ్బంది ఆండాలు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.