నల్లగొండ జిల్లాలో ఉన్మాది పైశాచికానందం

కోదాడ:  పోలీసుల కథనం ప్రకారం… కోదాడ పట్టణం బంజారా కాలనీలో నివాసముంటున్న వేముల వెంకటరమణ (35) భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. వెంకటరమణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం సంత ఎదురుగా నివాసముండే అవివాహితుడైన చింతల రమేష్‌కు వెంకటరమణతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర శారీరక సంబంధానికి దారితీసింది. వీరి బంధాన్ని బంధువులు, కుమారులు ఒప్పుకోకపోవడంతో రమేష్‌ను వెంకటరమణ దూరంగా పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మద్యం సేవించి వెంకటరమణ ఇంటికి వచ్చాడు. ఆమెతో గొడవపడి రాడ్‌తో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో వెంకటరమణ ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.