నల్లగొండ జిల్లాలో నిలిచిపోయిన రెండు రైళ్లు

నల్లగొండ : జిల్లాలోని భువనగిరి సమీపంలో అధిక లోడ్‌తో వెళ్తున్న గూడ్స రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, వంగపల్లి స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.