నల్లధన కుబేరుల జాబితాలో జగన్‌కి స్థానం: సోమిరెడ్డి
హైదరాబాద్: దేశంలో నల్లధన కేబేరుల జాబితాలో స్థానం కోసం తెలుగువాడైన జగన్ పోటీ పడుతున్నాడని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 49 వేల కోట్ల రూపాయలు నల్లధనం ఉందని అధికారింగా ప్రకటిస్తే ఒక్క జగన్ దగ్గరే 43 వేల కోట్ల రూపాయలు ఉందని సీబీఐ పేర్కొందన్నారు. జగన్‌పై విచారణ పూర్తియ్యేసరికి తాను చెప్పినట్లే జగన్ ఆస్తి లక్షకోట్ల రూపాయలకు చేరుతుందన్నారు. ఈ రోజు బ్లాక్‌డేగా పరిగణించి నల్లచొక్కాతో నిరసన తెలుపుతున్నట్లు సోమిరెడ్డి అన్నారు. ఇంత చిన్న వయసులో ఐఏఎస్, ఐపీఎస్‌లను జైలుకు పంపిన ఘనత ఒక్క జగన్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు.