నల్లబ్యా డ్జి లతో బిజెపి కార్యకర్తలు నిరసన

ముస్తాబాద్ సెస్టంబర్ 18 జనం సాక్షి
తెలంగాణా విమోచన దినోత్సవం రోజున ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిజాం నిరాకుంశ పాలనా గురించి ప్రస్థావించకుండా,నిజాం రజాకార్లపై తిరుగుబాటు చేసిన  దొడ్డి కొమురయ్య, చాకలి.ఐలమ్మ, రావి. నారాయణ రెడ్డి, బద్దం. ఎల్లారెడ్డి లాంటి దాదాపు నాలుగు వేలాది మంది  ప్రాణాలు అర్పించి తెలంగాణా కి రజాకార్ల నుండి విముక్తి కలిగిస్తే కనీసం అమరులైన మహనీయుల గురించి కూడా మాట్లాడ్లకుండ తెలంగాణా చరిత్ర ను కనుమరుగయ్యే విధంగా ఎంఐఎం  పార్టీ కి  కెసిఆర్ తలవంచి బయపడి తెలంగాణా ప్రజల్ని అవమాన పరించినందుకు  ముస్తాబాద్  మండల కేంద్రాలో స్థానిక వివేకానంద విగ్రహం వద్ద  నల్ల  బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి,టౌన్ అధ్యక్షుడు మహేందర్, పి ఎస్ ఎస్ డైరెక్టర్ గిరిధర్ రెడ్డి,  దళిత మోర్చా నాయకులు మీసా శంకర్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఎదునూరి గోపి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్ధన్,Sc మోర్చా మండల అధ్యక్షుడు కేసుగాని తిరుపతి బీజేవైఎం నాయకులు  పెంజర్ల కళ్యాణ్, కిట్టు, వెంకటేష్,  ఓరుగంటి సత్యం, బోయిని వేణు, హర్ష, బెదురా ప్రశాంత్, బాబు, అజేయ్ రాంప్రసాద్ , ఆది శేఖర్, పాల్గొన్నారు