నల్లా గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

వికారాబాద్‌ : బూరుగు పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు అక్కడే ఆటలాడుతున్న చిన్నారి అనూష నల్లా కోసం తీసిన గుంతలో పడి మరణించింది. వ్యవసాయ కూలీ అయాన రాములు ఇంటి ముందు నల్లా కోసం అమరాంచగడానికి గొయ్యి తీశాడు. నల్లా ఇంకా అమర్చలేదు. అయితే ఈ రోజు సాయంత్రం పడిన వర్షంతో గుంత నిండింది. అనూష ఆడుకుంటూ వచ్చి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆడుకుంటూ వచ్చి గుతలో తలకిందులుగా పడి పోయింది. గుంత చిన్నదే అయినా నీటితో ఉండడంవల్ల పాప మృతి చెందింది.