నవంబర్‌ 1 నుంచి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పథకానికి మోక్షం లభించింది. వారికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లే నగదు రహిత ఆరోగ్య రక్షణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. గతంలోనే దీనికి ఆమోదం లభించినా ఇప్పుడు ఉద్యోగుల ఆరోగ్య రక్షణ నిధి పేరిట 184 జీఓ జారీ చేశారు. ఇది నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది.