నాంపల్లి కోర్టుకు నేడు జగన్‌ హాజరు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మంగళవారం ఆయనతో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయి రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు మన్మోహన్‌ సింగ్‌, శామ్యూల్‌లు న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నారు. మంత్రి ధర్మాన, ఐఏఎస్‌ అధికారులు మినహా జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, విజయసాయి రెడ్డిలు ఇప్పటికే అరెస్టయి జైలుపాలైన సంగతి తెలిసిందే. జగన్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకురానున్న నేపధ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టు వరకూ ట్రాఫిక్‌ జాంలు ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.