నాగారంలో సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ అధికారుల విలేజ్

 స్టడీ టూర్ జనం సాక్షి , మంథని : సివిల్ సర్వీసెస్ ట్రైని అధికారుల విలేజ్ స్టడీ టూర్ లో భాగంగా నాలుగవ రోజు షెడ్యూల్ ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరిగే విధానం,మాస్టర్ విధానం చెల్లింపులు ఇతర విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ద్వారా రేషన్ సరఫరా జరిగే విధానాన్ని పరిశీలించడం కోసం రేషన్ దుకాణాన్ని సందర్శించడం జరిగింది. తర్వాత గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సందర్శించి బాల బాలికలతో వసతుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ మహిళలతో కలిసి వేడుకలలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని గ్రామానికి అతిథులుగా వచ్చిన సివిల్ సర్వీస్ అధికారులను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను కూడా ఉన్నత స్థానాలకు ఎదగడానికి మంచి చదువులు చెప్పించాలని ఆకాంక్షించారు. అతిథిగా పాల్గొన్న సివిల్ సర్వీసు ట్రైనీ అధికారి గాయత్రి గోయల్ గారు మాట్లాడుతూ ఈ గ్రామంలో మహిళలందరూ ఆర్థికంగా ఎదుగుతున్నరని , గ్రామ మహిళలని అభినందించారు. గ్రామమంతటా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉందని , విద్యుత్ దీపాలు ఉన్నాయని , ఈ గ్రామ పంచాయతీకి విలేజ్ స్టడీ టూర్ నిమిత్తం రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామం అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ కి పదివేల రూపాయల బహుమతి అందించారు, వార్డు మెంబర్ బూడిద జైపాల్ మాట్లాడుతూ.. నాగారంలో బిస్కెట్ యూనిట్ ద్వారా మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నారని వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మహిళలు కూడా వారి సొంత కాళ్లపై నిలబడాలని ఆకాంక్షించారు అనంతరం మహిళా అధికారులకు పుష్పగుచ్చాలు అందించి శాలువాల తో సన్మానం చేశారు. గ్రామంలోని మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు, ఈ కార్యక్రమంలో అఖిల భారత సర్వీసు ట్రైనీ అధికారులు అనిషా, లక్ష్మీనారాయణ, సుజిత్, అభిషేక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేశ్,మండల పంచాయతీ అధికారి ఆరిఫ్ హుస్సేన్, వార్డు సభ్యులు మద్దెల మల్లేశ్వరి, దాసరి తార ,తోకల శైలజ, ఏఎన్ఎం లు పద్మ, స్వరూప,ఆశ వర్కర్ అంగన్వాడి టీచర్ ఎల్లమ్మ, వివో అధ్యక్షురాలు రాజేశ్వరి, వి వో ఏ శశికళ, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది మహిళా సంఘం సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.